Srileela : టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎనర్జిటిక్ హీరోయిన్ శ్రీలీల. అమ్మడు తాజాగా కోలీవుడ్ వైపు అడుగులు వేయడానికి సిద్ధమవుతోంది. కే. రాఘవేంద్ర రావు ‘పెళ్లి సందడి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తన హైపర్ యాక్టివిటీ,  అద్భుతమైన నటనతో యూత్ ఆడియన్స్‌ను తనవైపు తిప్పుకుంది.

‘ధమాకా’ సినిమాతో మంచి విజయం సాధించిన శ్రీలీల, వరుస ఆఫర్లతో బిజీగా గడిపింది. అయితే ‘భగవంత్ కేసరి’ అండ్ ‘గుంటూరు కారం’ వంటి చిత్రాలు మంచి సక్సెస్ సాధించినా.. ఆ చిత్రాల క్రెడిట్ అంతా ఆయా హీరోల ఖాతాల్లోకి వెళ్ళిపోయాయి. తదుపరిగా పవన్ కళ్యాణ్‌తో నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై ఆమె ఆశలు పెట్టుకున్నప్పటికీ, చిత్రం విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో, శ్రీలీల తన కెరీర్‌ను కొత్త మలుపు తిప్పేందుకు కోలీవుడ్ వైపు అడుగులు వేస్తోొంది.

‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక చిత్రంలో శివ కార్తికేయన్‌తో జత కట్టనుంది. కోలీవుడ్‌లో శివ కార్తికేయన్‌కు మంచి క్రేజ్ ఉండటంతో పాటు, సుధా కొంగర దర్శకత్వంలో వచ్చే సినిమాలు హిట్ అవుతాయనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది.

ఈ ప్రాజెక్ట్ శ్రీలీల కోలీవుడ్ కెరీర్‌కు మంచి బూస్ట్ ఇస్తుందని భావిస్తోంది. మొత్తానికి శ్రీలీల, కొత్త అవకాశాల కోసం కోలీవుడ్ వైపు మొగ్గు చూపుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, శ్రీలీల తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమల్లో తనదైన ముద్ర వేయగలదు.

Leave a comment

error: Content is protected !!