Venky – Anil combo : ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ సినిమాల తర్వాత వెంకీ అండ్ అనిల్ రావిపూడి కాంబోలోని హ్యాట్రిక్ చిత్రం ప్రస్తుతం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేశ్ భార్యగా ఐశ్వర్య, మాజీ ప్రియురాలిగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం కొత్త షెడ్యూల్ పొల్లాచిలో మొదలైంది.

ప్రస్తుతం అక్కడి అందమైన లోకేషన్లలో వెంకటేశ్ అండ్ ఐశ్వర్యలపై భార్యాభర్తల ప్రేమను తెలిపే ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం రాశారు. భాను మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు అందిస్తున్నారు. ఈ చిత్రం ఒక ముక్కోణపు క్రైమ్ డ్రామా కథాంశంతో రూపొందుతోంది. ఇందులో వెంకటేశ్ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!