Nani : నేచురల్ స్టార్ నాని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎస్.జె.సూర్య విలన్ గా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

హీరో నాని ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “సరిపోదా శనివారం అందరికీ నచ్చే సినిమా అవుతుందని” ఆశాభావం వ్యక్తం చేశారు. “మీరు నా నుంచి ఎలాంటి సినిమా కోరుతారో, అలాంటి సినిమా ఇది” అని అన్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారని, ముఖ్యంగా ఎస్.జె.సూర్య పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. “ఈ సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నా గురించి కాదు, ఎస్.జె.సూర్య గురించే మాట్లాడుకుంటారు” అని నాని ధీమాగా అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు కలిసొచ్చేలా ఉంటుందని చెప్పారు.

Leave a comment

error: Content is protected !!