Saripoda Sanivaram : నేచురల్ స్టార్‌ నానీ నటించిన అదిరిపోయే యాక్షన్ మూవీ ‘సరిపోదా శనివారం’. ఆగస్టు 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. ‘కనికరం లేదు, ప్రతీకారం మాత్రమే’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకులను ముందు నుంచి ఆకట్టుకుంటున్న ఈ సినిమాలో నాని పోషించిన పాత్ర ఎలాంటిది అనేది ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు, ట్రైలర్ల ద్వారా స్పష్టమైంది. ప్రతీకారం కోసం పయనించే యువకుడిగా నాని కనిపించనున్నాడు.

హీరోగా తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు నానీ. ప్రియాంకా మోహన్ జోడీగా నటిస్తోంది. ఎస్.జే.సూర్య విలన్‌గా తనదైన శైలిలో ఆకట్టుకోనున్నాడు. జేక్స్ బెజోయ్ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను అందించింది. సినిమా రన్‌టైమ్ 2 గంటల 50 నిమిషాలు.

‘అంటే సుందరానికి’ తర్వాత వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని నటిస్తున్న రెండో చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. తాజాగా రిలీజైన పోస్టర్లు మరియు ట్రైలర్లు కూడా సినిమాపై క్రేజ్‌ను పెంచాయి. నాని మరో హిట్‌ను కొట్టబోతున్నాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!