Kiran and Rahasya :  టాలీవుడ్ లో ప్రేమ వివాహాలు క్వైట్ కామన్. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు కిరణ్ అబ్బవరం అండ్ రహస్య గోరక్‌ల జోడీ కూడా చేరింది. ఈ ఇద్దరూ ఒకే సినిమాతో టాలీవుడ్ లో జోడీగా అడుగుపెట్టి.. అదే సినిమా షూటింగ్ లో ప్రేమలో పడి, చివరకు ఇప్పుడు వివాహ బంధంతో ఒక్కటి కావడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం.

కిరణ్ అబ్బవరం తన కెరీర్‌ను ‘రాజావారు రాణిగారు’ సినిమాతో ప్రారంభించగా, ఈ సినిమాలో రహస్య హీరోయిన్‌గా నటించారు. సినిమా షూటింగ్‌ సమయంలో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఇద్దరూ తమ ప్రేమను గోప్యంగా ఉంచారు. అయితే, వారి మధ్య ఉన్న అనుబంధం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కిరణ్ అబ్బవరం మరియు రహస్య గోరక్‌ల పై వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించలేదు. అయితే, కొన్ని రోజుల క్రితం వీరి వివాహం జరుగుతుందని వార్తలు వచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచాయి. గురువారం కుటుంబ సభ్యులు మరియు కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ విషయం తెలిసి అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్‌లు చేశారు. వీరి వివాహానికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

Leave a comment

error: Content is protected !!