Naga chaitanya : నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య తనకున్న వేగంపై ఉన్న మక్కువను మరోసారి నిరూపించారు. చిన్నప్పటి నుంచి కార్ రేసింగ్‌లు, ఫార్ములా వన్‌పై ఉన్న ఆసక్తిని ఇప్పుడు నిజ జీవితంలోకి తీసుకొచ్చారు. ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్ఎఫ్) లో పాల్గొనే హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఫ్రాంచైజీని సొంతం చేసుకోవడం ద్వారా రేసింగ్ వరల్డ్‌లోకి అడుగు పెట్టారు.
ఐఆర్ఎఫ్ నిర్వహించే ఫార్ములా 4 రేసుల్లో పాల్గొనడం ద్వారా చైతు తన రేసింగ్ జర్నీని ప్రారంభించారు. ఈ రేసులు ఆగస్టు 24 నుంచి ప్రారంభం కానున్నాయి. చైతు ఈ అవకాశం గురించి మాట్లాడుతూ, “నాకు చిన్నప్పటి నుంచి మోటార్ స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఫార్ములా వన్‌లోని హైస్పీడ్ డ్రామా నన్ను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఐఆర్ఎఫ్ నాకు ఒక కాంపిటీషన్ కంటే ఎక్కువ. ఇది నా ఫ్యాషన్‌ను ప్రదర్శించుకునే మంచి వేదిక” అని అన్నారు.
హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకోవడంపై చైతు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఈ టీమ్‌తో ఇండియన్ మోటార్ స్పోర్ట్స్ మరింత ఎత్తుకు ఎదగనుందని ఆయన నమ్ముతున్నారు. ఐఆర్ఎఫ్ ఫ్యాన్స్‌కు మరచిపోలేని అనుభూతిని ఇస్తుందని కూడా ఆయన అన్నారు. ఇండియన్ రేసింగ్ లీగ్‌లో నాగ చైతన్యతో పాటు బాలీవుడ్ నటులు అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ వంటి ప్రముఖులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. ఈ స్టార్స్‌తో కలిసి రేసింగ్ చేయడం చైతుకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది.