Shahid Kapoor : తన తాజా చిత్రం ‘దేవా’ షూటింగ్‌ను ఇటీవల పూర్తి చేసుకున్న బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన దర్శకుడు విశాల్ భరద్వాజ్‌తో మూడవసారి కలిసి పని చేయనున్నారు. గతంలో ఈ డ్యూయో కలిసి చేసిన ‘కమినే’ మరియు ‘హైదర్’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతుండటంతో సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సాజిద్ నడియాడ్‌వాలా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉండనున్నాయి. విశాల్ భరద్వాజ్ ఇలాంటి పూర్తి స్థాయి యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించడం ఇదే మొదటిసారి. చిత్రబృందం త్వరలోనే ఈ చిత్రం షూటింగ్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు కాలేదు.

Leave a comment

error: Content is protected !!