Prabhas – Hanu combo : టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తున్న కాంబినేషన్ ప్రభాస్ అండ్ హను రాఘవపూడి. ఈ కాంబోలో తెరకెక్కిస్తున్న సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రం 1947 నేపథ్యంలో సాగే ఓ ఎపిక్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

ఈ సినిమాలో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడిగా కనిపించనున్నారని తెలుస్తోంది. కథలో సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ నేపథ్యం కూడా కనిపించనుంది. ఈ చారిత్రాత్మక నేపథ్యంలో సాగే కథలో ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుందనేది ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా, జయప్రద కీలకపాత్రలో నటిస్తున్నారు. అలాగే.. మూవీలో బాలీవుడ్ డిస్కోడ్యాన్సర్ మిథున్ చక్రవర్తి కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. గోపాలా గోపాలా తర్వాత మిథున్ చక్రవర్తి తెలుగులో నటించబోయే సినిమా ఇదే.

Leave a comment

error: Content is protected !!