M4M movie: ‘మల్లెపువ్వు’, ‘మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ వంటి విభిన్నమైన చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు మోహన్ వడ్లపట్ల తాజాగా ‘M4M’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఒడిశా సూపర్ స్టార్ సంభీత్ ఆచార్య మరియు అమెరికన్ యాక్ట్రస్ జోశర్మ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు వసంత్ ఇసైపెట్టై అందించిన సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని దర్శకుడు మోహన్ వడ్లపట్ల ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ట్యూన్స్ ఇప్పటి వరకు చూసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు.

‘M4M’ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు వసంత్ ఇసైపెట్టై అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకర్షించి అంచనాలను పెంచింది. ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై తుది మెరుగులు దిద్దుబాటు పనులు జరుగుతున్నాయి.

తనకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చిన దర్శకుడు మోహన్ వడ్లపట్లకు వసంత్ ఇసైపెట్టై కృతజ్ఞతలు తెలిపారు. తన ప్రయత్నానికి సహకరించినందుకు ఆయనకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఈ చిత్రం మ్యూజిక్ లవర్స్‌ను బాగా నచ్చుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘M4M’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!