Kaveri movie : రిషిత, ఫైజల్, షేక్ అల్లాబకాషు, ఖుషీ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా”కావేరి”. స్యాబ్ క్రియేషన్స్ బ్యానర్ పై షేక్ అల్లాబకాషు నిర్మించిన ఈ చిత్రానికి రాజేష్ నెల్లూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రస్తుత సమాజంలోని ఆడవారి పై జరుగుతున్న అన్యాయాల గురించి తెలియజేస్తూ, అమ్మాయిలు తమపై జరిగే దాడులను ఎదుర్కొని ధైర్యంగా పోరాడాలనే సందేశాన్ని ఇస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

సినిమాలోని సోషల్ మెసేజ్ తనను బాగా ఆకట్టుకుందని, అలాంటి సినిమాలో నటించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉందని హీరోయిన్ రిషిత అన్నారు. బిగ్ స్క్రీన్ మీద తనను తాను చూసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని హీరో ఫైజల్ అన్నారు. తనకు అలాంటి అవకాశం ఇచ్చిన దర్శకుడు మరియు నిర్మాతకు కృతజ్ఞతలు తెలిపారు.

కావేరి క్యారెక్టర్ బోల్డ్ మరియు రా అండ్ రస్టిక్ గా ఉంటుందని, రిషిత ఆ క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించిందని రాజేశ్ నెల్లూరు అన్నారు. సినిమాలో మెసేజ్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని, అమ్మాయిలు మరియు అబ్బాయిలు కూడా ఈ సినిమాను చూడాలని షేక్ అల్లాబకాషు: కోరారు.

సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరిందని, నిర్మాత షేక్ అల్లాబకాషు మరో రెండు సినిమాలకు కూడా తననే సంగీత దర్శకుడిగా తీసుకున్నారని సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ తెలిపారు. సినిమాలోని సోషల్ మెసేజ్ సమాజానికి తెలియజేయాలని కోరారు బిగ్ బాస్ ఫేమ్ కీర్తి భట్ . సినిమాలోని కంటెంట్ బాగుందని, ఇది బిగ్ హిట్ కావాలని ఆకాంక్షించారు.

Leave a comment

error: Content is protected !!