Gopi – Sunny combo : టాలీవుడ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తన క్రేజ్ ను బాలీవుడ్ వరకు విస్తరిస్తున్నారు. సన్నీడియోల్ హీరోగా తెరకెక్కిస్తున్న పవర్ ఫుల్ యాక్షన్ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం భారీ అంచనాల మధ్య తెరకెక్కుతుంది.

గోపీచంద్ మలినేని చిత్రాలంటే మాస్ మసాలా ఎలిమెంట్స్ కు పెద్ద పేరు. ఆయన ఈ బాలీవుడ్ చిత్రంలో కూడా తనదైన శైలిలో యాక్షన్ సన్నివేశాలను రూపొందించే అవకాశం ఉంది. ఇంతకుముందు రవితేజతో కలిసి ఒక చిత్రాన్ని చేయాలని భావించినప్పటికీ, ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి సన్నీ డియోల్ తో కొత్త ప్రాజెక్టును ప్రారంభించడం గమనార్హం.

సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో రణదీప్ హూడా సినిమా షూట్ లో కి చేరాడు. తన  పుట్టిన సందర్భంగా  అతనికి విషెస్ చెబుతూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ నేపథ్యంలో   సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రణదీప్ హూడా ఈ చిత్రంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారనే విషయం ఇంకా రహస్యంగా ఉంచబడింది.  ఈ చిత్రానికి సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్న సంగీతం సినిమాకు మరో హైలైట్. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

గోపీచంద్ మలినేని ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘క్రాక్’ మరియు ‘వీర సింహారెడ్డి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగు పెడుతున్న ఈ దర్శకుడు, తన కెరీర్ లో మరో మైలురాయిని సృష్టించాలని భావిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!