Vijay Devarakonda : టాలీవుడ్ లో ప్రస్తుతం ఎంతగానో ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటి విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్. ఈ డ్యూయో కలిసి చేయబోయే కొత్త చిత్రం గురించి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ భారీ ప్రాజెక్ట్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఈ చిత్రం 1854-1878 మధ్య కాలంలో రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ ఒక ధీరోదాత్తుడైన యోధుడి పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ విషయం చిత్ర వర్గాల నుండి అధికారికంగా ప్రకటించబడింది.
ఇప్పుడు ఈ చిత్రం గురించి మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది. విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం విజయ్ కొత్త మేకోవర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో చిత్రీకరణ ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.