Balakrishna @ 50 : తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణమైన నందమూరి బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్‌లో గ్రాండ్ సెలబ్రేషన్స్‌ను తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.

ఈ వేడుకకు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, నటులు, నిర్మాతలు, దర్శకులు అందరూ హాజరవుతున్నారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఫెడరేషన్ నుంచి భరత్ భూషణ్ , దామోదర్ ప్రసాద్ , ప్రసన్నకుమార్ , రాజా రవీంద్ర, జెమినీ కిరణ్ , కె. ఎల్. నారాయణ , మాదాల రవి , అనుపం రెడ్డి , నిర్మాత సి కళ్యాణ్ , డైరెక్టర్ వీర శంకర్ , నిర్మాత అశోక్ కుమార్ , అనిల్ వల్లభనేని వీరందరూ కలిసి చిరంజీవిని ఈ వేడుకకు ఆహ్వానించారు.

చిరంజీవి ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించి, నాలుగు సంస్థల పెద్దలతో ముచ్చటించి కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. ఈ వేడుక తెలుగు సినీ పరిశ్రమలోని రెండు పెద్ద స్టార్ల మధ్య స్నేహాన్ని ప్రదర్శించే అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నారు. ఈ వేడుక తెలుగు సినీ పరిశ్రమ చరిత్రలో మరపురానిగా నిలిచిపోతుందని అంచనా.

Leave a comment

error: Content is protected !!