Harihara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలైంది. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. దర్శకుడు జ్యోతి కృష్ణ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణ జరుగుతుంది.

ప్రముఖ యాక్షన్ దర్శకుడు స్టంట్ సిల్వ ఆధ్వర్యంలో ఈ సన్నివేశాలు చిత్రీకరించబడుతున్నాయి. దాదాపు 500 మంది ఫైటర్లు మరియు జూనియర్ ఆర్టిస్టులు ఈ సన్నివేశాలలో పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే ఈ సెట్‌లో చేరనున్నారు. ‘హరి హర వీరమల్లు’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ‘హరి హర వీరమల్లు పార్ట్‌-1: స్వార్డ్‌ వర్సెస్‌ స్పిరిట్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్, అద్భుతమైన కథాంశం, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!