Devara Glimpse : యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లోని మోస్ట్ అవైటెడ్ మూవీ ‘దేవర’. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న ఈ మరో పాన్ ఇండియా చిత్రం సెప్టెంబర్ 27న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లు, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా సైఫ్ అలీ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా ‘దేవర’ సినిమా నుండి ఆయన పాత్ర ‘భైర’ కు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్‌లో సైఫ్ అలీ ఖాన్ అద్భుతమైన స్ర్కీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భైర పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా, భయంకరంగా చిత్రీకరించారు. అనిరుద్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వల్ల గ్లింప్స్‌కు మరింత బలం చేకూర్చింది. సైఫ్ అలీ ఖాన్ రెండు వేర్వేరు షేడ్స్‌లో కనిపించడం విశేషం. ఆయనపై చిత్రీకరించిన ఫైట్ సీక్వెన్స్‌లు, సెట్‌లు కొరటాల శివ క్రియేటివిటీకి నిదర్శనం. ఈ గ్లింప్స్‌తో ‘దేవర’ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Leave a comment

error: Content is protected !!