స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమాలతో ఎంతగా ఊపిరి సలపని బిజీలో ఉన్నప్పటికీ .. ఫ్యామిలీ లైఫ్ కు మంచి ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు తన పిల్లల్లో పిల్లాడిలా కలిసిపోయి వారితో సరదా గా ఎంజాయ్ చేస్తాడు. అలాగే.. భార్య స్నేహా రెడ్డితో కలిసి పెర్సనల్ అండ్ అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. రీసెంట్ గా బన్నీ.. సతీ సమేతంగా బ్లాక్ డ్రెస్ లో మెరిసి అభిమానులకు షాకిచ్చాడు. అల్లు దంపతులు బ్లాక్ అండ్ బ్లాక్ ఖాదీ కుర్తాలో దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
బన్నీ, అతడి వైఫ్ ధరించిన డ్రెసెస్ ను అబు జైన్ సందీప్ ఖోస్లా డిజైన్ చేయగా.. ప్రముఖ మోడల్ ఫోటో గ్రాఫర్ ఇంద్రనీల్ రాథోడ్ తన కెమేరా లో బంధించాడు. ప్రస్తుతం బన్నీ ‘అల వైకుంఠ పురములో’ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నాడు. ఆ ఆనందమంతా ఇప్పుడు ఈ ఫోటో లో ఎక్స్ ప్రెస్ అవుతుండడంతో బన్నీ అభిమానులు భలేగా ఖుషీ అవుతున్నారు. ఈ ఇద్దరి ఫోటోస్ ను తెగ మెచ్చుకుంటూ పెయిర్ ఇన్ బ్లాక్ అనే కాంప్లిమెంట్ కూడా ఇచ్చేశారు. ఇక బన్నీత్వరలోనే సుకుమార్ మూవీ కోసం జులపాల జుట్టు, కోరమీసాలతో కూడిన మేకోవర్ చేయబోతున్నాడట. అందుకే తన లాస్ట్ గెటప్ ను ఇలా ఈ ఫోటోలో చూసుకుంటాడేమో..