Venky – Anil combo : విక్టరీ వెంకటేష్ , అనిల్ రావిపూడి కలయికలో మూడో చిత్రం ప్రస్తుతం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ కాంబో ఇప్పుడు మూడవ చిత్రంతో మరోసారి అద్భుతమైన విజయాన్ని అందుకోవడానికి సిద్ధమవుతున్నారు. లేటెస్ట్ గా వెంకీ ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్టు అఫీషియల్ గా ఒక వీడియో ద్వారా తెలిపారు మేకర్స్.

వెంకీ అనిల్ 3′ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం కేరళలోని పొల్లాచిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో వెంకటేష్ ఓ మాజీ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఆయన ఓ అల్ట్రా స్టైలిష్ లుక్‌తో సెట్స్‌లోకి ఎంటరై అభిమానులను అలరిస్తున్నారు. ఈ లుక్‌తో వెంకటేష్ వింటేజ్ రోజులను గుర్తు చేస్తున్నారు.

ఈ సినిమాను ఓ ట్రయాంగులర్ క్రైమ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. వెంకటేష్ పోషిస్తున్న మాజీ పోలీస్ అధికారి పాత్ర చుట్టూ కథ తిరుగుతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య సాగే కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.

భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. భీమ్స్ ఇప్పటికే అనేక హిట్ సినిమాలకు సంగీతం అందించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాకు కూడా ఆయన అద్భుతమైన సంగీతాన్ని అందించి సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తారని భావిస్తున్నారు.

ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. సంక్రాంతి సీజన్‌లో విడుదలయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించి బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుందని భావిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!