Bheema kannada movie : కన్నడ చిత్రసీమలో దునియా విజయ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘భీమా’. ఇది తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేందుకు ప్రయత్నించింది. ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో బాలకృష్ణతో విలన్ పాత్ర పోషించడం దునియా విజయ్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. కథానాయకుడిగా ఉన్నప్పటికీ బాలయ్యపై అభిమానంతో నెగటివ్ షేడ్స్ కి ఒప్పుకోవడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
ఈ చిత్రం బెంగళూరు నగరంలో మాదకద్రవ్యాల సమస్యను నేపథ్యంగా చేసుకుని ఈ సినిమా రూపొందించబడింది. మెకానిక్ గా పని చేస్తూ రౌడీయిజం చేసే భీమా, తన కుటుంబానికి జరిగిన నష్టానికి ప్రతీకారం తీర్చుకోవడానికి డ్రగ్ మాఫియాను ఎదుర్కొంటాడు. విపరీతమైన హింసాత్మక దృశ్యాలతో నిండిపోయింది. సాఫ్ట్వేర్ సిటీలో మాదకద్రవ్యాలు ఇంత దారుణంగా చెలామణిలో ఉన్నాయా అనిపించే రేంజ్ లో భీమా భయపెడతాడు.
చిత్రం కర్ణాటకలో భారీగా వసూళ్లు సాధించింది. హైదరాబాద్ తో పాటు కర్నూలు లాంటి పలు నగరాల్లోనూ ఏకకాలంలో రిలీజ్ చేయడం ద్వారా తెలుగు మార్కెట్లో కూడా మంచి ప్రతిస్పందన లభించింది. కథలో కొత్తదనం లేకపోయినా తెరమీద హింసని ఇష్టపడే వాళ్ళను విజయ్ నిరాశపరచడు కానీ మరీ ఇంత ఓవర్ గా చూపించడం అవసరమా అనిపించేలా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి అనే విమర్శలు వస్తున్నాయి.