NTR : యంగ్ టైగర్ యన్టీఆర్ అభిమానులకు రాబోయే రోజుల్లో వరుసగా మాస్ ఫీస్ట్ ఉండబోతోంది. వరుస సినిమాలతో తారక్ తన అభిమానులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత యన్టీఆర్ నుంచి రాబోయే సినిమాలు ఇంకే రేంజ్ లో ఉంటాయో ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. రాబోయే రెండేళ్లలో ఎన్టీఆర్ నుండి ఏకంగా నాలుగు సినిమాలు రాబోతున్నాయని తెలియగానే అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

ఈ ఏడాది మొదటగా విడుదలకు రెడీ అవుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ “దేవర”. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా రెండు భాగాల మధ్య కనీసం ఎనిమిది నెలల గ్యాప్ ఉంటుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున విడుదల కాబోతోంది.

ఇక 2025లో ఎన్టీఆర్ నుండి రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఒకటి హృతిక్ రోషన్‌తో కలిసి నటిస్తున్న “వార్ 2”. ఈ సినిమాను 2025 చివర్లో విడుదల చేయాలని భావిస్తున్నారు. అలాగే దీనికి ముందే అంటే 2025 ప్రథమార్ధంలో ‘దేవర 2’ సినిమాను విడుదల చేసేందుకు కొరటాల అండ్ టీమ్ ప్రయత్నిస్తోంది.

ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. మొత్తంగా చూస్తే, “ఆర్‌ఆర్‌ఆర్‌” తరువాత వచ్చిన గ్యాప్‌ను ఎన్టీఆర్ ఈ నాలుగు సినిమాలతో భర్తీ చేస్తున్నాడు. రాబోయే రెండేళ్లు ఎన్టీఆర్ అభిమానులకు పండగే!

Leave a comment

error: Content is protected !!