Devara : మ్యాన్ ఆఫ్ ది మాసెస్ యన్టీఆర్, మాస్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’ పార్ట్ 1 ప్రేక్షకులను ఆకట్టుకోడానికి రెడీ అవుతోంది. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు.

తాజాగా, దేవర సెట్స్ నుంచి ఆయుధ పూజ అంటూ.. సోషల్ మీడియాలో ఓ పిక్ వైరల్ అవుతోంది. ఇందులోని పవర్‌ఫుల్‌గా డిజైన్ చేయబడిన కత్తి కనిపించింది. ఈ కొత్త అప్‌డేట్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరింత ఉత్సాహంగా ఉన్నారు. మేకర్స్ ఎన్టీఆర్‌తో వేరే లెవెల్ మాస్ నే ప్లాన్ చేస్తున్నారని చెప్పవచ్చు.

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కొరటాల శివ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు. దేవర సినిమాలో ఎన్టీఆర్ ఓపెనింగ్ సీక్వెన్స్ లోని మూడవ పాట గురించి ఇప్పటికే ఎన్నో రూమర్స్ వినిపిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఆయుధ పూజ వీడియో ఈ అంచనాలను మరింత పెంచింది.

Leave a comment

error: Content is protected !!