Ram Pothineni:  టాలీవుడ్ లోని మోస్ట్ అవైటెడ్ చిత్రం “డబుల్ ఇస్మార్ట్”. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకులలో ఎంతగానో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూపర్ హిట్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హన్మకొండలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ ఈ సినిమా గురించి విశేషాల్ని పంచుకున్నారు.

రామ్ పోతినేని మాట్లాడుతూ, పూరి జగన్నాథ్‌ హీరోలు బుల్లెట్లయితే .. ఆయన గన్ లాంటి వాడు. స్ఫూర్తిదాయకమైన దర్శకుడాయన. రచయిత కావాలి, దర్శకుడు కావాలని పరిశ్రమకు వచ్చారంటే అందులో ఎక్కువమంది పూరి గారిని చూసి వచ్చుంటారు. ఆయనతో కలిసి పనిచేయడం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సినిమాలో సంగీతంపై మణిశర్మ ఎంతో శ్రద్ధ తీసుకున్నారని, సీక్వెల్ సినిమా కావడంతో కథపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని, కానీ ఈ సినిమాకి సంగీతంపై కూడా అంతే అంచనాలున్నాయని మణిశర్మ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా, సోషల్ మీడియాలోని అభిప్రాయాలను పట్టించకుండా, మనకు నచ్చిన పని చేయాలని అభిమానులకు సలహా ఇచ్చారు. ఆగస్టు 15న థియేటర్లో అందరూ కలుద్దాం అని ఆహ్వానించారు.

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ, ‘‘ఈ సినిమా గురించి చెప్పాలంటే… గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు రామ్‌ పోతినేని. తను సెట్లోకి నడిచొచ్చినా, సీన్‌చేస్తున్నా అందులో కసి కనిపిస్తుంటుంది. అది మామూలుగా ఉత్సాహాన్నివ్వదు. పాత్ర, తన గెటప్, నడక, తెలంగాణ యాస, తెలియని బలుపు… ఇవన్నీ రామ్‌ చేయకపోతే అంతగా ఆస్వాదించలేం. ఈ సినిమాలో రామ్ పోతినేని పాత్ర చాలా కీలకమని, తన నటన, డాన్స్, తెలంగాణ యాస అన్నీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని అన్నారు. సంజయ్ దత్‌తో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని, ఆయన ఈ సినిమాకి కొత్త కళను తీసుకొచ్చారని తెలిపారు. విజయేంద్ర ప్రసాద్‌ తన ఫ్లాప్ సినిమా తర్వాత తనకు ఫోన్ చేసి, తన అనుభవాలను పంచుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నాకూ, మా బృందానికి విజయం అవసరం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఈ సినిమా తీశామని చెప్పారు.

ఈ సినిమాలో కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్నారు. ఛార్మి కౌర్‌తో కలిసి పూరి జగన్నాథ్ నిర్మించారు. ఈ చిత్రం ఇస్మార్ట్ శంకర్‌కి కొనసాగింపు. అలీ, విషురెడ్డి, గెటప్‌ శ్రీను, టెంపర్‌ వంశీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డబుల్ ఇస్మార్ట్‌ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ మరోసారి మెప్పిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!