Tollywood : డిజిక్వెస్ట్, సిటిడెల్ క్రియేషన్స్ బ్యానర్‌లలో రూపొందిన ‘ది డీల్’ సినిమా పోస్టర్‌ను హైదరాబాద్‌లోని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్‌లో ఘనంగా ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఐఏఎస్ డాక్టర్ కేవి రమణాచారి సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు. నటన, దర్శకత్వంపై మంచి అవగాహన ఉన్న హను కోట్ల ఈ సినిమాతో మన ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.

సినిమా కథానాయకుడు, దర్శకుడు హను కోట్ల మాట్లాడుతూ, రంగస్థలం నుండి సినిమా వైపు అడుగులు వేస్తున్నాను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. ఒక డిఫరెంట్ స్టోరీతో మీ ముందుకు వస్తున్నానన్నారు. డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ యం.డి కె.బాసి రెడ్డి, టీఎఫ్పీసీ అధ్యక్షుడు కేయల్ దామోదర్ ప్రసాద్, ప్రముఖ సినీ రచయితలు బుర్రా సాయిమాధవ్, ఆకెళ్ల శివ ప్రసాద్‌ తదితరులు మాట్లాడుతూ, పెద్ద స్టార్స్ లేని సినిమాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, కంటెంట్ ఏ కింగ్ లాంటిదని, క్రియేటివిటీతో వచ్చిన సినిమాలు నిలబడతాయని అన్నారు.

రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా సినిమా రంగానికి పరిచయమైన హను కోట్ల ఆ తర్వాత ఆర్ జే గా, నటునిగా, నాటక రచయితగా, ఆధునిక నాటక దర్శకుడిగా ఎన్నో గొప్ప ప్రయోగాలు చేశారు. ఇప్పుడు ఆయన తాజాగా ‘ది డీల్’ సినిమాతో హీరోగా, దర్శకునిగా మన ముందుకు వస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!