RC 16: “ఉప్పెన” సినిమా తో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు బుచ్చిబాబు. ఆ సినిమా ఆయన కెరీర్ నే మలుపు తిప్పింది. ఇప్పుడు ఆయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తన రెండో సినిమా చేయబోతున్నాడు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటించబోయే సినిమా ఇదే . రామ్ చరణ్ కెరీర్ లో ఇది 16వ చిత్రం.  బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.  ఇదొక రా అండ్ రస్టిక్ డ్రామా అని, ఇందులో స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్ ను మనం ఇప్పటి వరకు చూడని లుక్‌లో చూడబోతున్నామని అంటున్నారు. ఈ సినిమా పూర్తిగా పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ గురించి చెప్పాలంటే.. ముందుగా సెప్టెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు కానీ, ఇప్పుడు అక్టోబర్ కి వాయిదా పడినట్లు తెలుస్తోంది. అక్టోబర్ లో షూటింగ్ మొదలైతే ఎలాంటి గ్యాప్ లేకుండా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నది ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ.ఆర్. రెహమాన్.

Leave a comment

error: Content is protected !!