Mechanic Rocky : మాస్ కా దాస్ విష్వక్ సేన్ లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ’ తో అలరించ బోతున్నాడు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్ర పోషిస్తోంది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే రొమాంటిక్ సాంగ్ కు రిలీజ్ చేశారు మేకర్స్.

‘గుల్లేడు గుల్లేడు గులాబీలు’ అంటూ సాగే.. పాట ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది. మంగ్లీ ఆలపించిన ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించగా, జేక్స్ బెజోయ్ సంగీతం అందించారు. విష్వక్ మరియు మీనాక్షి వేస్తున్న ఎనర్జిటిక్ స్టెప్పులు ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచాయి. నరేశ్, వైవా హర్ష, హర్షవర్ధన్ తదితరులు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!