Vayanad Landsliding : ప్రకృతి విపత్తుల సమయంలో తెలుగు చిత్రసీమ ఎల్లప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కేరళ వరదల సమయంలో కూడా తెలుగు సినీ ప్రముఖులు తమ మానవతా దృక్పథాన్ని చాటుకుంటున్నారు. వయనాడ్ లో కొండచెరియలు విరిగి పడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు ఇప్పటి వరకూ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు స్పందించి వారికి ఆర్ధికంగా అండగా నిలిచారు.

తాజాగా అందరి డార్లింగ్ హీరో ప్రభాస్ కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2 కోట్ల విరాళం ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వయనాడ్‌ ప్రజలకి తన సానుభూతిని తెలుపుతూ, ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని కోరారు. ప్రభాస్ దాతృత్వం తెలుగు సినీ పరిశ్రమ యొక్క మానవతా దృక్పథానికి నిదర్శనం. ప్రభాస్ లాంటి గొప్ప వ్యక్తుల వల్లే మన సమాజం మరింత మెరుగు పడుతుంది. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలు ధైర్యంగా ఉండాలని మనందరం కోరుకుందాం.

Leave a comment

error: Content is protected !!