Priyanka Chopra : బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లేటెస్ట్ హాలీవుడ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది బ్లఫ్’ చిత్రీకరణ ఇటీవలే ముగిసింది. ఈ సందర్భంగా ప్రియాంక సోషల్ మీడియా వేదికగా షూటింగ్ సమయంలోని మధుర క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

“ది బ్లఫ్ సెట్స్‌పై బ్లడీ ఫన్ టైమ్స్. నా షెడ్యూల్‌ గురించి తెలియని వారి కోసం, 1800 సంవత్సరం నాటి హింసాత్మక సమయంలో జీవిస్తున్నాను. చిత్రబృందం ప్రతి సెట్‌ని ఎంత అద్భుతంగా సృష్టించిందో!” అంటూ ప్రియాంక తన పోస్ట్‌లో రాశారు. ఈ చిత్రంలో ప్రియాంక ఎర్సెల్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా భారీ సెట్లు, ప్రత్యేకమైన ఎఫెక్ట్స్‌లను చూపించే వీడియోలను కూడా ప్రియాంక తన ఫాలోవర్స్‌తో పంచుకున్నారు. కార్ల్ అర్బన్, జోర్డన్ మూనే తదితరులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ‘ది బ్లఫ్’ చిత్రం విడుదల తేదీని త్వరలోనే చిత్రబృందం ప్రకటించనుంది. ప్రియాంక చోప్రా అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!