Prabhas – Hanu combo :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌, బ్రిలియంట్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. ఈ భారీ పాన్‌ ఇండియా సినిమా పూజా కార్యక్రమాలు ఈ నెల మూడవ వారంలో జరగనున్నాయి. అనంతరం నాలుగో వారం నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

ఈ సినిమా కథ స్వాతంత్య్రం పూర్వం నేపథ్యంలో సాగుతుంది. ప్రేమ , యుద్ధం అనే రెండు అంశాలను కలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కొన్ని పాటలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ , హను రాఘవపూడి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుండడంతో మరిన్ని వివరాల కోసం మనం ఆతృతగా ఎదురు చూడాల్సి ఉంది.

ఇంతకు ముందు దుల్కర్ సల్మాన్ , మ‌ృణాళ్ ఠాకూర్ జోడీగా హను రాఘవపూడి సీతారామం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా లవ్ అండ్ వార్ కథాంశంగానే రూపొందింది. పీరియాడికల్ వే లో ఒక హృద్యమైన కథను చెప్పాడు హను. ఈ సినిమా టాలీవుడ్ లో హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పుడు ప్రభాస్ తోనూ అలాంటి కథాంశమే తీయబోతున్నాడు హను. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!