Devara : యంగ్ టైగర్ యన్టీఆర్ , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తొలిసారిగా జోడీగా నటిస్తున్న హై యాక్టెన్ యాక్షన్ మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం యువసుధ ఆర్ట్స్, యన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్త నిర్మాణంలో రూపొందుతోంది. ఈ సినిమాలోని రెండో పాటను ఈ నెల 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఎన్టీఆర్ అండ్ జాన్వీ కపూర్‌లపై చిత్రీకరించిన ఈ రొమాంటిక్ సాంగ్ కు బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిస్ కొరియో గ్రఫీ అందించారు.

ఎన్టీఆర్ అద్భుతమైన స్టెప్పులు, జాన్వీ కపూర్ యొక్క అందమైన గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అనిరుధ్ ఇప్పటికే విడుదల చేసిన పాటలతో అంచనాలు పెంచారు. ఈ పాట కూడా అలాంటిదే అని అభిమానులు ఆశిస్తున్నారు.

‘దేవర’ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుంది. ఈ సినిమా తొలి భాగం సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదలకు ఇంకా కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సినిమా భారీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!