Saripoda Sanivaram : దసరా, హాయ్ నాన్న చిత్రాలతో వరుసగా హిట్స్ అందుకున్న నేచురల్ స్టార్ నానీ.. తదుపరి చిత్రం ‘సరిపోదా శనివారం’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 29, 2024న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్రముఖ కోలీవుడ్ నటుడు ఎస్.జె. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.

చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో నాని చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నాడు. చేతిలో ఆయుధంతో ఉన్న నాని లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌ను విడుదల చేస్తూ మేకర్స్ “హాయ్ ఆగస్ట్, నువ్వు ఎండ్ అయ్యే సమయానికి మేము స్టార్ట్ అవుతాం” అని క్యాప్షన్ ఇచ్చారు.

ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నాని యాక్షన్ అవతార్, వివేక్ ఆత్రేయ దర్శకత్వం ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాయి.

Leave a comment

error: Content is protected !!