Raghuthatha trailer : మల్లూ బ్యూటీ కీర్తి సురేశ్‌ ప్రస్తుతం హిందీ భాషను చాలా కష్టపడి నేర్చుకుంటోంది. ఆమె ఎందుకు ఇంతగా కష్టపడుతోందో తెలుసుకోవాలంటే, త్వరలో విడుదల కాబోతున్న ఆమె కొత్త సినిమా ‘రఘుతాత’ చూడాల్సిందే. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రను పోషిస్తోంది.

రఘుతాత’ అనే ఈ సినిమా హిందీ భాష రాకపోయినా, హిందీ వాతావరణంలో చిక్కుకున్న ఒక తమిళ అమ్మాయి కథను తెలుపుతుంది. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌ ‘కయల్విజి’ అనే పాత్రలో కనిపిస్తుంది. కీర్తి సురేశ్‌ మరియు రవీంద్ర విజయ్‌ మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులను నవ్వులతో ముంచెత్తుతాయి. కీర్తి సురేశ్‌, రవీంద్ర విజయ్‌, ఎంఎస్‌ భాస్కర్, దేవదర్శిని, రాజీవ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సినిమా ట్రైలర్‌ను ఇప్పటికే విడుదల చేశారు. ట్రైలర్‌ చూసిన ప్రేక్షకులు కీర్తి సురేశ్‌ చేస్తున్న కామెడీకి ఫిదా అవుతున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!