Devara 1 : యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. ఎన్టీఆర్‌ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుండగా, తొలి భాగం ‘దేవర పార్ట్‌ 1’ సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

ఈ చిత్రంలో తారక్‌కు ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. చిత్ర క్లైమాక్స్‌లో మరో విలన్‌గా బాబీ దేవోల్‌ కూడా కనిపించనున్నారని సమాచారం. ముగింపులో తెరపైకి వచ్చే ఆయన పాత్ర, ‘దేవర పార్ట్‌ 2’లో కీలకంగా నిలవనుందని, తను రెండో భాగంలో సైఫ్‌తో కలిసి ఎన్టీఆర్‌ను ఢీ కొడతారని ప్రచారం జరుగుతోంది.

మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ముస్తాబవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. త్వరలో హైదరాబాద్‌లో ఆఖరి పాటను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్‌ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.

 

Leave a comment

error: Content is protected !!