Saripoda Shanivaram : నేచురల్ స్టార్ నానీ నటించిన పాన్ ఇండియా చిత్రం “సరిపోదా శనివారం”. ఈ సినిమా నుండి రెండో పాట శనివారం విడుదలైంది. ఈ చిత్రాన్ని వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా డీవీవీ దానయ్య, కల్యాణ్ దాసరి నిర్మించారు. గ్యాంగ్ లీడర్ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె.సూర్య, సాయికుమార్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

“ఉల్లాసం ఉరికే ఎదలో.. ఉరిమే ఉత్సాహమె ఊపిరిలో” అంటూ సాగే ఈ పాటకు జేక్స్‌ బిజోయ్ సంగీతం అందించగా, సనరే సాహిత్యం రాశారు. సంజిత్‌ హెగ్డే, కృష్ణ లాస్య ముత్యాల ఈ పాటను ఆలపించారు.  ఈ పాట ప్రారంభంలో, “నేను చేసుకోబోయే వాడు వైలెన్స్ స్పెల్లింగ్ కూడా తెలియని వాడై ఉండాలి. అలా ఎవరుంటారు చెప్పు” అని ప్రియాంక అడగడం, “వైలెన్స్ అనే పదంలో ఒక ఎస్ ఉంటుందా? రెండు ఎస్‌లు ఉంటాయా?” అని నాని అమాయకంగా తిరిగి ప్రశ్నించడం చాలా ఫన్నీగా  అనిపిస్తుంది. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!