Kiran Abbavaram : టాలీవుడ్ లో టాలెంట్ తో పాటు, స్టైలిష్ లుక్ తో మెప్పించే యువ హీరో కిరణ్ అబ్బవరం. కానీ, ఆయన నటించిన చివరి రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించినంత విజయం సాధించలేదు. ఈ నేపథ్యంలో, పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కిరణ్ అబ్బవరం తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. “క” అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది.

ఈ పోస్టర్ లో, కిరణ్ అబ్బవరం వెనక్కి తిరిగి చూస్తున్నట్టు కనిపిస్తున్నాడు. టైటిల్ లో “క” అనే అక్షరం తో పాటు కొన్ని రాశులు కూడా ఉన్నాయి. ఈ చిత్రం పాన్ ఇండియా రిలీజ్ కు సిద్ధమవుతున్నట్లు ఈ పోస్టర్ ద్వారా స్పష్టమైంది. “క” చిత్రానికి శ్రీ చక్రాస్ బ్యానర్ నిర్మాణం వహిస్తుండగా, సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నాడు. గత రెండు సినిమాల ఫలితాలతో కాస్త డీలా పడిన కిరణ్ అబ్బవరం ఈ చిత్రం తో మళ్లీ బలంగా రావాలని భావిస్తున్నాడు. పాన్ ఇండియా ఎంట్రీ అనే ఆసక్తికరమైన అంశం తో పాటు, కిరణ్ కొత్త లుక్ ఈ చిత్రం పై అంచనాలను పెంచుతోంది.

Leave a comment

error: Content is protected !!