Mr.Bachan : మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలోని మరో సినిమా మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం నుంచి లేటెస్ట్ గా సితార్ పాట ఫుల్ లిరికల్ వీడియో విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది. ఇటీవల విడుదలైన ప్రోమోతోనే మంచి స్పందన పొందిన ఈ పాట, ఇప్పుడు పూర్తి స్థాయిలో వినోదప్రియులను ముగ్ధులను చేస్తోంది. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం ‘రైడ్’ కు రీమేక్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ, భాగ్యశ్రీ జంటగా నటిస్తున్నారు.

టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి షూటింగ్ పూర్తి అయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. గేయ రచయిత సాహిత్య అందించిన అద్భుతమైన సాహిత్యానికి, మిక్కీ జేఏసీ మేయర్ స్వరకల్పన జోడించి, సాకేత్, సమీరా మధురంగా పాడటంతో ఈ పాట మరింత శ్రావ్యంగా మారింది.

చాలా రోజుల తర్వాత విన్నట్టుగా ఉన్న పూర్తి తెలుగు పాట అని నెటిజన్లు ఈ పాటను మెచ్చుకుంటున్నారు. రవితేజ, భాగ్యశ్రీ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఈ పాటకు హైలైట్. రొమాంటిక్ మెలోడీలో వారు వేసిన స్టెప్పులు చూడగానే మనసుకు హాయిగా అనిపిస్తుంది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ పాటను తన ప్రత్యేక శైలిలో చిత్రీకరించి, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.

Leave a comment

error: Content is protected !!