Ari movie : ఆర్వీ సినిమాస్ అధ్యయనంలో, శ్రీనివాస్ రామిరెడ్డి, డా.తిమ్మప్ప నాయుడు పురిమెట్ల పీహెచ్ డీ, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న చిత్రం “అరి”. “మై నేమ్ ఈజ్ నో బడీ” అనే ఉపశీర్షికతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ తో పాటు శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా చిత్రబృందం చతుర్, వితుర్ పాత్రల్లో శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర ల ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. పండితుల వేషధారణలో వీరిద్దరూ సంభాషిస్తున్న ఫోటో ఆసక్తికరంగా ఉంది. “అరి” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!