Devara : “మ్యాన్ ఆఫ్ మాసెస్” ఎన్టీఆర్ నటించిన “దేవర” సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలుసు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్, ఫియర్ సాంగ్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటిస్తోంది. మరో నటి శ్రుతి మరాఠే కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. తారక్ భార్యగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, శ్రుతి హైదరాబాద్ లో జరుగుతున్న “దేవర” షూటింగ్ లో పాల్గొన్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది.

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. “దేవర” సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!