Saripoda Sanivaram : నేచురల్ స్టార్ నాని పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ చిత్రం “సరిపోదా శనివారం”. హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తోంది. “గ్యాంగ్ లీడర్” తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ జోడీగా నటిస్తున్న చిత్రమిది. తాజాగా చారులత పాత్రలో ప్రియాంక ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు మేకర్స్ .

ఈ మూవీలో ప్రియాంక మోహన్ చారులత అనే అమాయక పోలీసుగా నటించింది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నే రివీల్ చేశారు. ఆమె పాత్రకు సరిపోయేలా కనిపిస్తుంది. చక్కటి చిరునవ్వు, ఖాకీ యూనిఫారంతో, ఆమె భుజంపై బ్యాగ్‌తో రోడ్డు పై నడిచే లుక్ ఆకట్టుకుంటోంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకమని తెలుస్తోంది.

‘సరిపోదా శనివారం’ షూటింగ్ షెడ్యూల్ ముగింపు దశకు చేరుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించి, డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి నిర్మించిన “సరిపోదా శనివారం” చిత్రంలో ఎస్‌జె సూర్య కూడా కీలక పాత్రలో కనిపించారు. మురళి జి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పాన్-ఇండియా చిత్రం ఆగస్టు 29 న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!