Coolie : సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్టైనర్ “కూలీ”. ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ గా ప్రారంభమైంది. టైటిల్ గ్లింప్స్ తోనే ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకున్న ఈ చిత్రం, ఇటీవల విడుదలైన రజనీకాంత్ టెస్ట్ లుక్ మరింత ఆసక్తిని రేకెత్తించింది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ గ్రే షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు.

సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్న ఈ చిత్రం, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వ శైలిలో ఎలా ఉండబోతుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!