Rajanikanth : సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ ప్యాక్డ్ మూవీ “కూలీ”. ఈ సినిమా షూటింగ్ లేటెస్ట్ గా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. రజనీకాంత్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని చిత్రీకరణలో పాల్గొంటున్నట్లు సమాచారం.

ఈ షెడ్యూల్ సుమారు 35 రోజుల పాటు కొనసాగనుంది. బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ ఛాయాగ్రహణం నిర్వహిస్తున్నారు. “కూలీ” సినిమా 2024 చివరిలో విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!