Maharaja : తమిళ మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా సినిమా కోలీవుడ్ అండ్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం, ప్రేక్షకులను, అభిమానులను మెస్మరైజ్ చేసింది. రిలీజైన తొలిరోజు నుంచే సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకి తిరుగే లేకుండా పోయింది.

లేటెస్ట్ గా మహారాజా సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 100.18 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ థ్రిల్లర్ చిత్రం 100 కోట్లు రాబట్టడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కురంగు బొమ్మై ఫేమ్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్ దాస్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు.

 

Leave a comment

error: Content is protected !!