Allari Naresh : రీసెంట్ గా “ఆ.. ఒక్కటీ అడక్కు” చిత్రంతో ప్రేక్షకులను అలరించిన అల్లరి నరేశ్, ఇప్పుడు “బచ్చల మల్లి” సినిమాతో మరోసారి తనలోని టాలెంట్ ను మరోసారి బైట పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజేశ్ దండా, బాలాజీ గుత్తా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రావు రమేశ్, రోహిణి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఆదివారం నరేశ్ పుట్టినరోజు సందర్భంగా బచ్చలమల్లి చిత్రం నుండి ఒక గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ లో నరేశ్ మాస్ లుక్ లో కనిపించి, ఇంటి ముందు ఉన్న మైక్ సెట్ ను విసిరికొట్టడం, బార్ లో శత్రువులపై దాడి చేయడం వంటి సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఏయ్.. ఎవడి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి” అనే డైలాగ్ తో చిత్రంపై అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ లో విడుదల కానుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం, రిచర్డ్ ఎం.నాథన్ ఛాయాగ్రహణం ఈ చిత్రానికి అందించారు.

Leave a comment

error: Content is protected !!