ZEE 5 : భారతదేశంలో అతి పెద్ద ఓటీటీ ప్లాట్‌ఫారమ్ జీ 5. ఎల్లప్పుడూ ప్రేక్షకులకు కొత్త కంటెంట్‌ను అందించడంలో ముందుం టుంది. లేటెస్ట్ గా జీ 5 సంస్థ డైరెక్ట్ డిజిటల్ ఫిల్మ్ “రౌతు కా రాజ్”ను విడుదల చేసింది. ఈ మర్డర్ థ్రిల్లింగ్ మిస్టరీ చిత్రానికి ఆనంద్ సురాపూర్ దర్శకత్వం వహించగా, జీ స్టూడియోస్ మరియు ఫాట్ ఫిష్ రికార్డ్స్ నిర్మించాయి.
నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంలో సమర్థవంతమైన పోలీసు అధికారి దీపక్ నేగి పాత్రలో నటించాడు. ఉత్తరాఖండ్ లోని ఓ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో రాజేష్ కుమార్, అతుల్ తివారీ, నారాయణి శాస్త్రి కీలక పాత్రలు పోషించారు. గతేడాది జీ5లో విడుదలై విజయవంతమైన “హడ్డీ” తర్వాత, ఈ చిత్రం మరోసారి జీ5, జీ స్టూడియోస్, నవాజుద్దీన్ సిద్ధిఖీల కలయికలో వచ్చింది. అంచనాలకు తగినట్లుగానే, “రౌతు కా రాజ్” ప్రేక్షకులను ఆకట్టుకుంటూ జీ5లో హిట్ గా మారింది.
పదిహేనేళ్లుగా ఒక హత్య వంటి పెద్ద నేరం జరగని ఒక పట్టణంలోని అంధుల పాఠశాలలో వార్డెన్ అనుమానాస్పద మరణిస్తాడు. అతన్ని ఎవరు.. ఎందుకు చంపారనే పాయింట్ మీద రౌతు కా రాజ్ సినిమాను రూపొందించారు. ఆ ప్రాంతానికి చెందిన పోలీస్ స్టేషన్‌లోని స్టేషన్ హెడ్ ఆఫీసర్ దీపక్ నేగి (నవాజుద్దీన్ సిద్ధిఖీ), స్టేషన్‌లోని ఇన్‌స్పెక్టర్ దిమ్రి (రాజేష్ కుమార్)తో కలిసి కేసుని చేదించటానికి రంగంలోకి దిగుతాడు.