Good Bad Ugly : తమిళ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది.
గురువారం ఈ సినిమా నుంచి రెండో లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో అజిత్ ఖైదీ దుస్తుల్లో మాస్ లుక్‌లో కనిపించారు. చేతిపై టాటూ, జేబుపై 63 నంబర్, చుట్టూ మిషన్ గన్స్ ఫైరింగ్ నేపథ్యంలో అజిత్ లుక్ ఆకట్టుకుంటోంది. ఈ ఫోటో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.