Dulquer Salman : తెలుగు సినిమా పరంగా.. దుల్కర్ సల్మాన్ కు వైజయంతీ మూవీస్ తో ఒక ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. “మహానటి” చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన దుల్కర్, తొలి ప్రయత్నంలోనే మంచి సక్సెస్ నమోదు చేసుకున్నాడు. “సీతారామం” చిత్రంతో అయితే క్లాసిక్ హిట్ నే సాధించాడు. ఇప్పుడు “కల్కి” చిత్రంలో ఒక గెస్ట్ రోల్ లో తెరపై కనిపిస్తాడు.

తాజా సమాచారం ప్రకారం దుల్కర్ మరోసారి వైజయంతీ మూవీస్ తో ఒక సినిమాలో నటించనున్నాడు. పవన్ సాధినేని దర్శకత్వం వహించే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మరోవైపు, బాలకృష్ణ సినిమాలో దుల్కర్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో నటించిన “లక్కీ భాస్కర్” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!