Niveda Thomas : టాలెంటెడ్ హీరోయిన్ నివేదా థామస్ దాదాపు రెండేళ్ల విరామం తర్వాత నటనకు తిరిగి వస్తున్నారు. ఆమె ప్రస్తుతం నంద కిశోర్ ఈమాని దర్శకత్వంలో “35 – చిన్న కథ కాదు” అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

“35 – చిన్న కథ కాదు” చిత్రంలో ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తిరుపతి నేపథ్యంలో జరుగుతుంది. అందరి హృదయాలను హత్తుకునేలా ఉంటుందని చిత్రబృందం తెలియజేసింది.  ఈ చిత్రంలోని స్కూల్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని రానా దగ్గుబాటి తన సోషల్ మీడియాలో తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ సాగర్, ఛాయాగ్రహణం నికేత్ బొమ్మి అందిస్తున్నారు. “35 – చిన్న కథ కాదు” చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర దశలో ఉంది మరియు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 15న విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!