Bharateeyudu 2 trailer : యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. ఈ సినిమా రిలీజ్ గురించి అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా ఈ చిత్రం ట్రైలర్ విడుదలై.. ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ చిత్రం తెలుగులో భారతీయుడు 2 గా జూలై 12, 2024 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ, ప్రేక్షకులను కట్టిపడేసింది. దేశంలోని పరిస్థితుల నేపథ్యంలో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ప్రజలు అంతా సేనాపతి రాక కోసం ఎదురుచూస్తున్నట్లు చూపించారు. అప్పుడు కమల్ హాసన్ సేనాపతి గా ధాటిగా ఎంట్రీ ఇస్తారు. ఇంకా యాక్షన్ సన్నివేశాలు, అవినీతికి వ్యతిరేక పోరాటం గురించిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిద్ధార్ధ్ కీలక పాత్రలో నటించాడు.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ , రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, SJ సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం కమల్ హాసన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది.

 

Leave a comment

error: Content is protected !!