Darling movie : అందాల నభా నటేష్, కామెడీ హీరో ప్రియదర్శి జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం “డార్లింగ్”. ఈ సినిమా జులై 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి అశ్విన్ రాం దర్శకత్వం వహించగా, కె.నిరంజన్ రెడ్డి నిర్మించారు. బ్రహ్మానందం, అనన్య నాగళ్ల, కృష్ణతేజ్‌ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.

ఈ చిత్రం విడుదల తేదీని సోమవారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఒక కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. “డార్లింగ్” ఒక కొత్తదనంతో కూడిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని చిత్ర బృందం తెలిపింది. అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం, నరేశ్ రామదురై ఛాయాగ్రహణం అందించారు.

Leave a comment

error: Content is protected !!