Nagarjuna: అక్కినేని నాగార్జున చివరి సినిమా “నా సామిరంగ” బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తదుపరిగా నాగ్ ధనుష్, శేఖర్ కమ్ముల కాంబో మూవీ ‘కుబేర’ లో ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇంక అసలు విషయానికొస్తే.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నాగార్జున తాజాగా ఒక పోస్ట్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కింగ్ నాగార్జున ‘కుబేర’ మూవీ షూటింగ్ స్పాట్ లో ఉన్నప్పుడు, ఒక అభిమాని ఆయన దగ్గరకు వెళ్ళి సెల్ఫీ తీసుకోడానికి ప్రయత్నించాడు. అయితే, సెక్యూరిటీ గార్డ్ ఆ అభిమానిని విసురుగా పక్కకు నెట్టేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను చూసిన నాగార్జున తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ.. ఇలా జరగకూడదని ఆ అభిమానికి క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. నాగార్జున పోస్ట్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. చాలా మంది నెటిజన్లు నాగార్జున చర్యను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు సెక్యూరిటీ గార్డ్ చర్యను తప్పు పడుతున్నారు.

 

 

Leave a comment

error: Content is protected !!