G.O.A.T : ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సినిమాతో థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు తమిళ దళపతి విజయ్. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వెంకట్ ప్రభు తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించారు. మీనాక్షి చౌదరి కథానాయిక గా నటించింది.

విజయ్ 50 వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ను విడుదల చేశారు. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఈ ప్రచార చిత్రంలో ఓ ఛేజింగ్‌ సీక్వెన్స్‌ను చూపించారు. చివరగా, విజయ్ తండ్రీ కొడుకులుగా బైక్‌పై ఫైరింగ్‌ చేస్తూ కనిపించిన తీరు ఆకట్టుకుంది. ‘బిగిల్’ తర్వాత విజయ్ మరోసారి తండ్రీకొడుకులుగా ఈ మూవీలో కనిపించనుండడం విశేషం.

సైన్స్ ఫిక్షన్ అంశాలతో నిండిన ఓ ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. యువన్‌ శంకర్‌ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. “ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్” సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం విజయ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవడానికి అవకాశాలు ఉన్నాయి.

Leave a comment

error: Content is protected !!