Kiara Adwani :  లాస్ట్ ఇయర్ ‘సత్యప్రేమ్ కీ కథ’ ఒక్క సినిమాతో సరిపెట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఈ ఏడాది బ్యాక్-టు-బ్యాక్ సినిమాలతో దూసుకొస్తున్నారు. త్వరలోనే ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సుందరి, ఇటీవలే రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘డాన్ 3’లో నటించనున్నట్లు ప్రకటించారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించే ఈ యాక్షన్ థ్రిల్లర్ 2025లో ప్రారంభం కానుంది.

“డాన్ 3″లో పరిశ్రమకు పరిచయమయ్యేది కొత్త డాన్ పాత్ర అని, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. మొదటి షెడ్యూల్‌లో చిత్రం యొక్క కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ ‘సింగమ్ అగైన్’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ‘డాన్ 3’తో పాటు, కియారా అడ్వాణీ ఈ ఏడాది యన్టీఆర్, హృతిక్ రోషన్ భారీ మల్టీస్టారర్ వార్ 2 లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Leave a comment

error: Content is protected !!